లాక్‌డౌన్‌పై కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమీక్ష

రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

Published : 24 Mar 2020 15:34 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి సహా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం ఎలా ఉంది.. కరోనా కట్టడికి వివిధ జిల్లాల్లో చేపట్టిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన చర్యలు  తీసుకోవడంపై అధికారులతో ఆయన చర్చించారు. 

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలోనూ చాలా మంది తమ వాహనాల్లో రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మరోవైపు అత్యున్నతస్థాయి సమీక్ష అనంతరం జిల్లా కలెకర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను ప్రకటించే వీలుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని