తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి చెంత సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులు వేంచేశారు. శ్రీదేవి,

Published : 25 Mar 2020 11:23 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి చెంత సర్వభూపాల వాహనంలో ఉత్సవమూర్తులు వేంచేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి  ఉగాది ఆస్థానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ఉంచిన శార్వారి నామ సంవత్సర పంచాంగం తీసుకుని తితిదే ఆస్థాన సిద్దాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఆలంకరణ చేశారు. నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష విడిపూలను అలంకరణ కోసం వినియోగించారు. పండ్లు, కూరగాయలతో స్వామివారి ప్రతిరూపాలు, శంఖు, చక్ర నామాలను రూపొందించారు. ఉగాది ఆస్థానంలో అర్చకులు, సిబ్బంది పరిమితసంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని