విద్యార్థులను ఖాళీ చేయించొద్దు: తలసాని

సనత్‌నగర్‌ నయోజకవర్గ పరిధిలోని పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనిఖీ చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ లో పరిస్థితిని

Updated : 26 Mar 2020 12:54 IST

హైదరాబాద్‌: సనత్‌నగర్‌ నయోజకవర్గ పరిధిలోని పలు దుకాణాలను, సూపర్ మార్కెట్లను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనిఖీ చేశారు. ఎర్రగడ్డ మార్కెట్ లో పరిస్థితిని పరిశీంచిన తర్వాత యూసఫ్ గూడ లోని ఓ సూపర్ మార్కెట్ ను తనిఖీ చేశారు. మార్కెట్ రేటుకు ఇక్కడకు 15 రూపాలయలు తేడా ఉండటంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం వసతిగృహాల నిర్వాహకులతో మంత్రి సమావేశమయ్యారు. వసతిగృహాల నుంచి విద్యార్థులను ఖాళీ చేయించొద్దని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతిగృహాల నిర్వాహకులు ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని