చితక్కొట్టిన ఎస్‌ఐని.. సస్పెండ్‌ చేసిన డీజీపీ 

స్వీయ నిర్బంధం కాలేదని ఇద్దరిని చితక్కొట్టిన ఎస్ఐని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఓ యువకుడు స్వీయ నిర్బంధం కాలేదని పెరవలి

Updated : 27 Mar 2020 12:04 IST

పెరవలి: స్వీయ నిర్బంధం కాలేదని ఇద్దరిని చితక్కొట్టిన ఎస్ఐని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఓ యువకుడు స్వీయ నిర్బంధం కాలేదని పెరవలి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ లాఠీ ఛార్జి చేశారు. అక్కడే ఉన్న అతని తండ్రిని కూడా విచక్షణారహితంగా కొట్టారు. ఎస్‌ఐ లాఠీతో విచక్షణా రహితంగొ కొడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం డీజీపీ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. పెరవలి ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలి కానీ దాడిచేయడం కరెక్ట్‌ కాదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని