
Updated : 28 Mar 2020 10:52 IST
విద్యుత్ బిల్లుల చెల్లింపునకు వెసులుబాటు!
హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఈ నేపథ్యంలో విద్యుత్ మంత్రిత్వశాఖ సాధారణ ప్రజలకు సహాయ ప్యాకేజీని ప్రకటించే యోచనలో ఉంది. వచ్చే మూడు నెలలు విద్యుత్ బిల్లులు చెల్లించడంలో ఆలస్యమైనా జరిమానా మినహాయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాల రెగ్యులేటరీలకు కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ ఇవాళ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై గత రెండ్రోజులుగా విద్యుత్ శాఖ అధికారులతో కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్.కె.సింగ్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
Tags :