కార్మికులకు జీతాలు ఇవ్వండి: మంత్రి మల్లారెడ్డి

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ

Published : 28 Mar 2020 17:09 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో పలు కంపెనీలు, ఫ్యాక్టరీలు తాత్కాలికంగా మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కంపెనీలు, వివిధ సంస్థలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలని తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన కార్మికుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘భవన నిర్మాణ కార్మికుల విషయంలో బిల్డర్స్‌ ఉదారంగా వ్యవహరించాలి.కార్మికులకు నిత్యావసరాలతో పాటు వసతి కల్పించాలి. అసంఘటిత కార్మికులను గుర్తించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలి. సౌకర్యాలు అందేలాకార్మికశాఖ ముఖ్య కార్యదర్శి చర్యలు తీసుకోవాలి. కార్మికులు కార్మికశాఖ లేదా నోడల్‌ అధికారులకు వివరాలు ఇవ్వాలి’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని