కారులో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఎక్సైజ్‌ సీఐ

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టుగా ఎక్సైజ్‌ శాఖలో కొందరు అధికారుల తీరు దారుణంగా ఉంది.  అనపర్తి ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్‌ను ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి సస్పెండ్‌ చేశారు.

Updated : 30 Mar 2020 10:28 IST

అమరావతి : లాక్‌డౌన్‌ వేళ కారులో మద్యం తరలిస్తూ ఎక్సైజ్‌ సీఐ పట్టుబడ్డారు. అనపర్తి ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్‌ను ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి సస్పెండ్‌ చేశారు. నిన్న కారులో సీఐ అక్రమంగా మద్యం తరలిస్తుండగా కుతుకులూరులో స్థానికులు పట్టుకున్నారు. సీఐ తీరుపై మంత్రి నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టుగా ఎక్సైజ్‌ శాఖలో కొందరు అధికారుల తీరు దారుణంగా ఉందన్నారు. సస్పెన్షన్‌తో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించినట్లు తెలిపారు. త్రినాథ్‌పై శాఖాపరమైన విచారణకు అదేశించామని..ఇలాంటి అక్రమాలు ఎవరు చేసినా తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని