కార్మికులకు ఉచిత మొబైల్‌ సర్వీసులివ్వండి 

వలస కార్మికులకు  నెలరోజులపాటు ఉచితంగా  మొబైల్‌ సర్వీసులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ  టెలికం సంస్థలను...

Updated : 30 Mar 2020 13:10 IST

టెలికం సంస్థలకు ప్రియాంక లేఖ 


న్యూదిల్లీ :  వలస కార్మికులకు నెలరోజులపాటు ఉచితంగా మొబైల్‌ సర్వీసులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ  టెలికం సంస్థలను కోరారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ,  ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌  భారతీ మిట్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, వొడాఫోన్‌ల అధిపతులకు ఆమె వేర్వేరుగా లేఖలు రాశారు. 
కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులు భోజన, వైద్య, వసతి సౌకర్యాలు లేకుండానే వందల కిలోమీటర్లు కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారు. వారి వద్ద ఉన్న  ఫోన్లలో రీఛార్జ్‌ చేసుకునేందుకు డబ్బులు కూడా ఉండవు కాబట్టి తమ కుటుంబసభ్యులు, బంధువులతో మాట్లాడేందుకు వీలుండదని ఆ లేఖల్లో ప్రియాంక పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  ఆయా టెలికం సంస్థలు వలస కార్మికులకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్‌కమింగ్‌, అవుట్‌ గోయింగ్‌ మొబైల్ సర్వీసులు అందించాలని ఆమె అభ్యర్థించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని