కరోనా జాగ్రత్త: ఆకట్టుకుంటున్న మంత్రి చర్య

ఈ చిత్రంలోని వ్యక్తిని గమనించారా... ఆయన శాస్త్రవేత్తో, స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తో, ప్రభుత్వ శాఖకు చెందిన అధికారో కాదు...

Published : 30 Mar 2020 21:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ చిత్రంలోని వ్యక్తిని గమనించారా... ఆయన శాస్త్రవేత్తో, స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తో, ప్రభుత్వ శాఖకు చెందిన అధికారో కాదు... పశ్చిమ బెంగాల్‌  మంత్రి స్వపన్‌ దేబ్‌నాథ్. మరి ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? దేశమంతా కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కోరలు చాస్తున్న సందర్భంగా తమ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయటానికి దేబ్‌నాథ్ ఈ రోజు స్వయంగా బుర్ద్వాన్‌ పట్టణ వీధుల్లోకి వచ్చారు‌. కరోనా రక్షణ కవచాన్ని (కరోనా ప్రొటెక్టివ్‌ గేర్‌) ధరించిన ఈయన, కరోనా వైరస్‌ వ్యాప్తించకుండా ఉండాలంటే లాక్‌డౌన్‌ సమయంలో మీరందరూ ఇళ్లలోనే ఉండాలంటూ పట్టణ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని లోని లార్డ్‌ కర్జన్‌ గేట్‌ ప్రాంతంలో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ఎందరినో ఆకర్షిస్తోంది. చట్టసభల్లో కూర్చుని విధాన నిర్ణయాలు చేయటమే కాకుండా, ఇలాంటి కష్టసమయంలో బాధ్యతాయుతంతా వ్యవహరిస్తున్న మంత్రి చర్యను పలువురు హర్షిస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని