సరిహద్దులు దాటే అవకాశమే లేదు: సీపీ మహేశ్‌

ఇతర రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చే కార్మికులకు, విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు. ...

Published : 30 Mar 2020 22:33 IST

భువనగిరి: ఇతర రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చే కార్మికులకు, విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పంతంగి టోల్‌ప్లాజా వద్ద వలస కార్మికులకు ఆయన ఆహారాన్ని అందించారు. వసతి ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ప్రయాణికులతో వచ్చిన వాహనాలను ఆపేశారు. సరిహద్దులు దాటే అవకాశం లేదని కౌన్సిలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపించారు. అక్రమ రావాణాకు పాల్పడే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని