అనుపమ నాదెళ్ల రూ.2 కోట్ల సాయం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ల తన మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరుకు ఆమె రూ.4 కోట్లు విరాళం ఇచ్చారు. పీఎం కేర్స్‌కు, తెలంగాణ సీఎం సహాయ

Updated : 31 Mar 2020 23:47 IST

హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ల తన మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరుకు ఆమె రూ.4 కోట్లు విరాళం ఇచ్చారు. పీఎం కేర్స్‌కు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల చొప్పును సాయం చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. ‘‘కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికి ఆమె వ్యక్తిగత ఆదాయం నుంచి పీఎం కేర్స్‌, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల చొప్పును సాయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ఆమెకి మాతృభూమి పట్ల ఎంతో ప్రేమ ఉందనడానికి ఇది ఉదాహరణ’’ అని వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని