కరోనా రోగి టిక్‌టాక్‌ వీడియో

కరోనా బాధిత మహిళ చేసిన టిక్‌టాక్‌ వీడియోకు సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందని సస్పెండ్‌ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగి ఒకరు ఇటీవల టిక్‌టాక్‌ వీడియో చేయడానికి

Published : 02 Apr 2020 06:36 IST

సహకరించిన ముగ్గురి సస్పెన్షన్‌

 చెన్నై: కరోనా బాధిత మహిళ చేసిన టిక్‌టాక్‌ వీడియోకు సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందని సస్పెండ్‌ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగి ఒకరు ఇటీవల టిక్‌టాక్‌ వీడియో చేయడానికి ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బంది సహకరించారు. వీరు బాధిత మహిళ టిక్‌టాక్‌ చేస్తుండగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం ఆమెతో సెల్ఫీ దిగారు. ఐసొలేషన్‌ వార్డులో సెల్‌ఫోన్‌కు అనుమతి లేకపోయినా మహిళ పట్టుబట్టడంతో ఫోన్‌ ఇచ్చామని పారిశుద్ధ్య సిబ్బంది చెప్పినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఫాలోవర్లు తనను మరచిపోతారనే కారణంతో ఇలా వీడియో చేశానని కరోనా బాధితురాలు పేర్కొన్నట్లు తెలిపాయి. ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించిన అధికారులు అనంతరం వారిని క్వారంటైన్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు