మరో రెండు టీకాలపై పరీక్షలు

కొవిడ్‌-19 నివారణకు ప్రయోగాత్మకంగా రెండు టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిపై పరీక్షలు మొదలుపెట్టారు. ఇక్కడి కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌వో) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. వైరస్‌

Published : 03 Apr 2020 06:38 IST

మెల్‌బోర్న్‌: కొవిడ్‌-19 నివారణకు ప్రయోగాత్మకంగా రెండు టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిపై పరీక్షలు మొదలుపెట్టారు. ఇక్కడి కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌వో) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. వైరస్‌ నుంచి మెరుగైన రక్షణ కోసం ఈ టీకాను ఎలా ఇవ్వాలన్నదానిపైనా వారు ఆలోచిస్తున్నారు. ఇంజెక్షన్‌ రూపంలో కండరాల్లోకి ఎక్కించాలా లేక ముక్కులో వేసుకునే స్ప్రేలా ఇవ్వాలా అన్నది పరిశీలిస్తున్నారు. ఈ టీకాలపై ప్రయోగాలకు మూడు నెలల సమయం పడుతుందని పరిశోధనలో పాలుపంచుకున్న ట్రెవర్‌ డ్రూ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని