వారి వల్లే ఎక్కువ కరోనా కేసులు: గవర్నర్‌

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు, ప్రభుత్వ చర్యలపై గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజ్‌భవన్‌ నుంచి రాష్ట్ర గవర్నర్‌

Updated : 03 Apr 2020 15:05 IST

అమరావతి: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు, ప్రభుత్వ చర్యలపై గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజ్‌భవన్‌ నుంచి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మూడు రోజుల నుంచి అనూహ్యంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల అంశాన్ని ప్రస్తావించిన గవర్నర్‌... అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సేవలందిస్తున్నారని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 30,693 మంది వచ్చినప్పటికీ వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించి, అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అధికంగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ భాగం దిల్లీలో జరిగిన సమ్మేళనానికి వెళ్లి వచ్చిన వారివేనని, వారితో పాటు కలిసి తిరిగిన వారిపైనా దృష్టి సారించి వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఉద్యాన పంటలు, ఇతర వ్యవసాయ పంటలు పండిస్తోన్న రైతులు, ఆక్వా సాగుదారులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని