కరోనాపై వాస్తవ సమాచారానికి వికీ కృషి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ గురించి సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారం పెద్ద ఎత్తున సర్క్యులేట్‌ అవుతోంది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేని సమాచారం....

Published : 03 Apr 2020 17:08 IST

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ గురించి సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారం పెద్ద ఎత్తున సర్క్యులేట్‌ అవుతోంది. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేని సమాచారం విపరీతంగా షేర్‌ అవుతోంది. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. అందుకే ప్రజలకు వాస్తవ సమాచారాన్ని తెలుగు సహా 10 భారతీయ భాషల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తోంది వికీపీడియా సంపాదకుల బృందం. ఇందుకోసం స్థానిక యూనివర్సిటీల సాయాన్ని కోరుతోంది.

కరోనా గురించి వికీ ఆంగ్లంలో విస్తృత సమాచారం అందుబాటులో ఉంది. ఈ పేజీని రోజుకు సగటున 2 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఆరోగ్య సమాచారాన్ని అందించేందుకు వీలుగా వికీపీడియా కొత్తగా స్వస్థ అనే గ్రూపు ఏర్పాటు చేసింది. ఆరోగ్య సమాచారాన్ని ప్రజలందరికీ ఉచితంగా అందించాలన్నది దీని ఉద్దేశం. కరోనాకు సంబంధించిన భారతీయ భాషల్లో పూర్తి స్థాయిలో, శాస్త్రీయ సమాచారం అందుబాటులో లేదు. ఇందుకోసం ఆయా స్థానిక విశ్వవిద్యాలయాలు సాయమందించాలని వికీపీడీయా వాలంటీర్‌ ఎడిటర్‌ అభిషేక్‌ సూర్యవంశీ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి గురించిన అపోహలు, అశాస్త్రీయంగా సమాచారాన్ని సమీక్షించి వాస్తవ సమాచారాన్ని అందించేందుకు తోడ్పడాలని కోరారు. 2014లో ఎబోలా వైరస్‌ కుదిపేసినప్పుడు సైతం వాస్తవ సమాచారాన్ని 50 భాషల్లోకి అనువదించి వికీపీడియా మన్ననలను పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని