ఆ ఐదేళ్ల చిన్నారికి కరోనా నెగిటివ్
కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించిన ఐదేళ్ల చిన్నారికి తాజా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ముంబయిలోని చెంబూర్‌కు చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడికి కొవిడ్-19 ఉన్నట్లు మార్చి 26న వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి బెడ్‌ను వాడటం వల్ల ఈ వైరస్....
ముంబయి: కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించిన ఐదేళ్ల చిన్నారికి తాజా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ముంబయిలోని చెంబూర్‌కు చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడికి కొవిడ్-19 ఉన్నట్లు మార్చి 26న వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి బెడ్‌ను వాడటం వల్ల తల్లీకొడుకులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. తొలుత వీరికి కుర్ల బాబా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆపై తీవ్రను గుర్తించి కస్తుర్బా ఆసుపత్రికి తరలించారు. తాజా రిపోర్ట్‌లో బాలుడికి నెగిటివ్ వచ్చినట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శుక్రవారం తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు తదుపరి చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో 2301 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మహారాష్ట్రలో దీని ప్రభావం అత్యధికంగా ఉంది. అక్కడ 335 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 16 మంది మృతి చెందారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!
-
Politics News
Jairam Ramesh: భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ: కాంగ్రెస్