ఒకరికి కరోనా: 54వేల మంది క్వారంటైన్‌

గుజరాత్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్‌ కావాల్సి వచ్చింది. సూరత్‌లోని రాండర్‌ జోన్‌లో ఇస్త్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్‌-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహనిర్బంధంలోకి వెళ్లారు. 12 ఆస్పత్రులు....

Published : 04 Apr 2020 00:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్‌ కావాల్సి వచ్చింది. సూరత్‌లోని రాండర్‌ జోన్‌లో లాండ్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్‌-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహ నిర్బంధంలోకి వెళ్లారు. 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 82 అంతర్గత దారులున్న ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారులు క్రిమి సంహారకాలతో శుభ్రం (శానిటైజ్‌) చేయించారు.

రాండర్‌ జోన్‌లో జన సాంద్రత చాలా ఎక్కువ. అందుకే ఒక్కరికి కొవిడ్‌-19 సోకగానే అధికారులు అప్రమత్తం అయ్యారు. 55 బృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే చేపట్టారు. ఇక వైరస్‌ సోకిన వ్యక్తి (67 ఏళ్లు) ఐసోలేషన్‌కు పంపించారు. ఆయన భార్య, కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్‌కు తరలించారు. లాండ్రీ దుకాణానికి కిలోమీటర్‌ పరిధిలో దారులన్నిటినీ బారికేడ్లతో మూసేశారు. ప్రస్తుతం భారత్‌లో 2088, గుజరాత్‌లో 87 మందికి కరోనా సోకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని