ఇంట్లోనే కరోనా పరీక్ష!

కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి... నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక పరీక్ష కిట్లను బయోనె అనే సంస్థ ఆవిష్కరించింది. వీటితో నిర్వహించే పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని, ఈ కిట్లకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)

Published : 04 Apr 2020 07:11 IST

కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి... నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక పరీక్ష కిట్లను బయోనె అనే సంస్థ ఆవిష్కరించింది. వీటితో నిర్వహించే పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని, ఈ కిట్లకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆమోదం లభించిందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ సరికొత్త పరీక్ష కిట్లను రూపొందించినట్లు, నాణ్యత పరమైన కఠిన పరిశీలనల తర్వాత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే బయోనె సంస్థ జన్యు, సూక్ష్మజీవుల పరిణామాలకు సంబంధించి పలు పరీక్షలను, పరిశోధనలను సాగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని