కడపలో రెండు కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 180 కరోనా కేసులు నమోదవ్వగా.. కడప జిల్లాలో ఇప్పటి వరకు 23 కేసులు బయటపడ్డాయి. నగర శివారులోని అలంఖాన్‌ పల్లెలో...

Published : 04 Apr 2020 15:03 IST

బాధితులు ఒకే కుటుంబానికి చెందినవారు

కడప: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 180 కరోనా కేసులు నమోదవ్వగా.. కడప జిల్లాలో ఇప్పటి వరకు 23 కేసులు బయటపడ్డాయి. నగర శివారులోని అలంఖాన్‌ పల్లెలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చిన వ్యక్తి ద్వారా మిగిలిన ముగ్గురికి వ్యాధి సోకినట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. రెండు రోజుల క్రితం తండ్రీ కొడుకులల్లో కరోనా బయటపడగా.. ఇవాళ అత్తా కోడళ్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎస్పీ వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతమంతా రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మరోవైపు జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంలో ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నారు. ప్రజలు ఎవరూ రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారు 70 సెకండరీ కాంటాక్ట్‌ కేసులను క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని