ఆక్వా రైతులను మోసం చేస్తే సహించం: జగన్‌

ఆక్వా రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఆక్వా ఉత్పత్తుల్లో దళారుల...

Published : 04 Apr 2020 20:06 IST

అమరావతి: ఆక్వా రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. ఆక్వా ఉత్పత్తుల్లో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టాలని కోరారు. సీఎం జగన్‌తో సముద్ర ఉత్పత్తుల అభివృద్ధి ఎగుమతి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్‌ శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. కరోనా దృష్ట్యా ఆక్వా రైతులు, ఉత్పత్తుల రావాణాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని ఎంపెడా ఛైర్మన్‌కు సీఎం సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత ధరలకు ఎగుమతిదారులు కొనుగోలు చేసేలా చూడాలని ఆదేశించారు. దీనిపై ఎగుమతి దారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపెడా ఛైర్మన్‌ సీఎంకు వివరించారు. తక్కువ ధరలకు కొంటే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని