ఇది పోలీస్‌ రోబో

కొవిడ్‌-19ను అరికట్టేందుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన టునీషియా పోలీస్‌ రోబోలను రంగంలోకి దించింది. పీగార్డ్‌గా సుపరిచితమైన ఈ రోబోలు రిమోట్‌ సాయంతో...

Published : 05 Apr 2020 08:41 IST

కొవిడ్‌-19ను అరికట్టేందుకు ఉత్తర ఆఫ్రికా దేశమైన టునీషియా పోలీస్‌ రోబోలను రంగంలోకి దించింది. పీగార్డ్‌గా సుపరిచితమైన ఈ రోబోలు రిమోట్‌ సాయంతో పనిచేస్తాయి. వీటికి ఇన్ఫ్రారెడ్‌, థర్మల్‌ ఇమేజ్‌ కెమెరాలు, సౌండ్‌ అండ్‌ లైట్‌ అలారాలను అమర్చారు. అక్కడ లాక్‌డౌన్‌ సమయంలో వీధుల్లో తిరుగుతూ అనుమానితులను గుర్తించి ‘ఏం చేస్తున్నావ్‌..? నీ ఐడీ చూపించు.. లాక్‌డౌన్‌ ఉందని తెలియదా..?’ అని ప్రశ్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను టునీషియా ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని