
రెండేళ్ల కరోనా బాలుడికి బర్త్‌డే వేడుక
పంజాబ్‌లోని నవన్‌షార్ సివిల్ ఆస్పత్రిలో..
చండీగఢ్: రెండేళ్ల కరోనా పాజిటివ్ బాలుడికి పుట్టిన రోజు వేడుకలు జరిపిన ఘటన పంజాబ్‌లోని నవన్‌షార్ సివిల్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నవన్‌షార్ ప్రాంతానికి చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల కరోనా వైరస్ సోకడంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలోనే అతని కుటుంబంలోని 14 మందికి వైరస్ వ్యాపించింది. అందులో రెండేళ్ల బాలుడితో పాటు అతని తల్లి కూడా ఉన్నారు. వీరిద్దరినీ నవన్‌షార్ సివిల్ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆ బాలుడి రెండో పుట్టిన రోజుగా గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వేడుకలు నిర్వహించారు. బాలుడికి కొత్త బట్టలు, చాక్లెట్లు బహుమతులుగా ఇచ్చారు. ఆస్పత్రి సిబ్బంది బర్త్‌డే కేక్ కూడా తెద్దామనుకున్నారని, లాక్‌డౌన్ కారణంగా అది వీలుకాలేదని ఆస్పత్రి సీనియర్ వైద్యాధికారి హర్విందర్ సింగ్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.