కరోనా నివారణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ

Published : 05 Apr 2020 17:19 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు, దిల్లీలో నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లొచ్చిన బృందాలకు సంబంధించిన పరీక్షలు ఎంతవరకు వచ్చాయనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. హోంక్వారంటైన్‌, ప్రభుత్వ క్వారంటైన్లలో ఉన్నవారి వివరాలపైనా ఆయన ఆరా తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని