‘గో కరోనా గో’ వైరల్‌ అవుతోంది: అథవాలే

ప్రపంచమంతా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో తాను పలికిన  ‘గో కరోనా గో’ స్లోగన్‌ వైరల్‌ అవుతోందని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అంటున్నారు. ఈ అంశంపై ఆయన

Updated : 06 Apr 2020 23:15 IST

ముంబయి: ప్రపంచమంతా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో తాను పలికిన ‘గో కరోనా గో’ స్లోగన్‌ వైరల్‌ అవుతోందని కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అంటున్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ..ఆదివారం దేశప్రజలంతా దీపాలను ఆకాశంవైపు చూపిస్తూ ‘కరోనా గో.. గో కరోనా’’ అని తాను పలికిన స్లోగన్‌ పలికినట్టు పేర్కొన్నారు. ఆయన నివాసం ఉండే సబర్బన్‌ బంద్రా ప్రాంతంలో ప్రజలు కూడా బిగ్గరగా ఈ స్లోగన్‌ను పలికారని ఆయన అన్నారు.

సామజిక మాధ్యమాల ద్వారా ప్రపంచమంతా ఈ స్లోగన్‌ వైరల్‌ అయ్యిందంటూ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 20న ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద చైనా కాన్సుల్‌ జనరల్‌ టాంగ్ గ్యుకోయి, కొద్దిమంది బౌద్ధులతో కలిసి రామ్‌దాస్‌ అథవాలే ‘కరోనా గో’ స్లోగన్‌ ఇవ్వడం నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అప్పటికి దేశంలో కరోనా ప్రభావం అంతగాలేదు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని