మరోసారి దాతృత్వం చాటిన కేటీఆర్‌

సాయం అందించాలని కోరే వారికి ఎప్పడూ అండగా ఉండే మంత్రి కేటీఆర్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ వ్యక్తి ట్విటర్‌లో చేసిన వినతికి స్పందించిన ఆయన పోలీసుల సాయంతో గర్భిణిని ఆసుపత్రిలో చేర్పించారు.

Updated : 06 Apr 2020 22:22 IST

మంచిర్యాల: సాయం అందించాలని కోరే వారికి ఎప్పుడూ అండగా ఉండే మంత్రి కేటీఆర్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ వ్యక్తి ట్విటర్‌లో చేసిన వినతికి స్పందించిన ఆయన పోలీసుల సాయంతో గర్భిణిని ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కొమ్మగూడెనికి చెందిన మహేశ్‌ వృత్తిరీత్యా వైజాగ్‌లో ఉంటున్నాడు. అతడి భార్య మౌనిక గర్భిణి. లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లడానికి ఎలాంటి వాహన సదుపాయమూ లేదు. దీంతో మహేశ్‌ ట్విటర్‌ వేదికగా విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు విన్నవించాడు. స్పందించిన మంత్రి లక్షెట్టిపేట పోలీసులకు సమాచారమిచ్చి గర్భిణిని ఆసుపత్రిలో చేర్పించారు. తన సందేశానికి స్పందించిన కేటీఆర్‌కు, పోలీసులకు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని