‘అదనపు గ్యాస్‌సరఫరాపై సౌదీ హామీ’ 

భారత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అదనపు ఎల్‌పీజీ(లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌)ను సరఫరా చేయడానికి యూఏఈ సిద్ధంగా ఉందని

Updated : 07 Apr 2020 23:31 IST

దిల్లీ: భారత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అదనపు ఎల్‌పీజీ(లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌)ను సరఫరా చేయడానికి యూఏఈ సిద్ధంగా ఉందని ఇంధనశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ట్వీట్‌ చేశారు. కరోనాపై పోరులో భాగంగా దేశమంతటా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ఎక్కడికక్కడ పరిశ్రమలు, కార్యాలయాలు మూతపడ్డాయి. పేద ప్రజలు డబ్బుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ‘ఉజ్వల’ పథకం కింద మొత్తం 3 గ్యాస్‌సిలిండర్లను కేంద్రప్రభుత్వమే పేదలకు ఉచితంగా ఇవ్వనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇండియాలోని ఆయిల్‌ రిఫైనరీలు పనిలో వేగం తగ్గింది. దీంతో దేశ అవసరాలకు సరిపడినంత గ్యాస్‌ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. యూఏఈ నుంచి భారత్‌కు క్రూడ్‌ఆయిల్‌ మాత్రమే కాక ఎల్‌పీజీని కూడా సరఫరా చేస్తుంది. దీంతో యాఏఈలో భారత్‌కు ప్రధాన సరఫరాదారైన అదాన్‌కోగ్రూప్‌ సీఈవో డా. సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబేర్‌, సౌదీ ఇంధనశాఖమంత్రి ప్రిన్స్‌ అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ సల్మాన్‌తో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భారత్‌కు అదనపు గ్యాస్‌ ఇచ్చేందుకు వారు హామీ ఇచ్చారని ధర్మేంద్రప్రధాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని