చంద్రుడిలో ఈ మార్పులు గమనించారా?

చంద్రుడిలో మంగళవారం భారీ మార్పులు కన్పించాయి. పౌర్ణమి రోజు సాధారణంగా కనిపించే దాని కంటే ఆకారంలో 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. దీన్ని పింక్‌ సూపర్‌ మూన్‌గా అభివర్ణిస్తారు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో..

Published : 08 Apr 2020 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చంద్రుడిలో మంగళవారం భారీ మార్పులు కన్పించాయి. పౌర్ణమి రోజు సాధారణంగా కనిపించే దాని కంటే ఆకారంలో 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా దర్శనమిచ్చాడు. దీన్ని పింక్‌ సూపర్‌ మూన్‌గా అభివర్ణిస్తారు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రుడు పెరిజీ స్థానంలోకి వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కక్ష్యలో భూమికి చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరిజీ అంటారు. అలానే దూరంగా ఉండే స్థానాన్ని అపొజీ అంటారు. మంగళవారం రాత్రి చంద్రుడు పెరిజీ స్థానానికి చేరుకోవడంతో ఆ సమయంలో పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించాడు. పింక్‌ సూపర్‌ మూన్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు పెరిజియన్‌ ఫుల్‌ మూన్‌ అని అంటారు. 



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని