పండిట్‌ రవిశంకర్‌కు వర్చువల్‌ నివాళి

ప్రముఖ సితార విధ్వాంసుడు, గ్రామీ అవార్డు గ్రహీత పండిట్‌ రవిశంకర్‌ శత జయంతిని ఆయన భార్య, కుమార్తె వినూత్నంగా నిర్వహించారు. ఆయన రూపకల్పన.....

Published : 08 Apr 2020 23:13 IST

దిల్లీ: ప్రముఖ సితార విద్వాంసుడు, గ్రామీ అవార్డు గ్రహీత పండిట్‌ రవిశంకర్‌ శత జయంతిని ఆయన భార్య, కుమార్తె వినూత్నంగా నిర్వహించారు. ఆయన రూపకల్పన చేసిన ‘సంధ్యా రాగాన్ని’ వర్చువల్‌గా నిర్వహించి ఘనంగా నివాళి అర్పించారు. ఏప్రిల్‌7న పండిట్‌ రవిశంకర్‌ శతజయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించాలని ఆయన భార్య సుకన్య, ఆయన కుమార్తె అనౌష్క తలపెట్టారు. కొవిడ్‌-19 కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడడంతో వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూనే తమ తమ వాద్య పరికరాలను లయబద్ధంగా పలికించారు. ఇందులో పాల్గొన్న వారంతా రవిశంకర్‌ శిష్యులే కావడం గమనార్హం. సితార్‌ వాయిద్యకారిణి అయిన అనౌష్క సైతం పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని