ఆ రాష్ట్రంలో మద్యం హోమ్‌ డెలివరీ!

దేశమంతా కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌ విధించినవేళ దుకాణాలన్నీ బంద్‌ అయ్యాయి. దీంతో మద్యం ప్రియులు మద్యం దొరక్క విపరీత చేష్టలకు దిగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.....

Published : 09 Apr 2020 01:46 IST

కోల్‌కతా: దేశమంతా కరోనాపై పోరుకు లాక్‌డౌన్‌ విధించినవేళ దుకాణాలన్నీ బంద్‌ అయ్యాయి. దీంతో మద్యం ప్రియులు మద్యం దొరక్క విపరీత చేష్టలకు దిగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం మద్యం హోమ్‌డెలివరీ చేసేందుకు వ్యాపారులను అనుమతించింది.

లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాలపై నిషేధం లేదని, అయితే వ్యాపారులు దుకాణాలు తెరవడానికి వీలు లేకపోవడంతో మద్యం హోమ్‌డెలివరీ చేసేందుకు అనుమతిచ్చామని ఆ రాష్ట్ర ఎక్సైజుశాఖ తెలిపింది. ఇందుకుగానూ వ్యాపారులు తమ ప్రాంతంలోని ఎక్సైజుశాఖ, పోలీస్‌శాఖ కార్యాలయాల వద్ద అనుమతి పత్రాలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతి దుకాణానికీ కేవలం మూడు పాస్‌లు మాత్రమే మంజూరు చేస్తామని తెలిపింది.

మద్యంప్రియులు ఉదయం 11 నుంచి మధ్యహ్నం 2 వరకు ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ పెట్టుకోవాలని, ఆ తర్వాత 2 నుంచి 5 గంటల దాకా డెలివరీ చేస్తారని  ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మిఠాయిషాపులూ నిర్ణీత సమయంలో వ్యాపారం చేసుకునేలా లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు