రాములోరి కల్యాణంపై సీఎంవోకు ఫిర్యాదు!

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మంగళవారం రాత్రి సీతారాముల కల్యాణం సందర్భంగా జరిగిన ఏర్పాట్లు, తితిదే అధికారులు, సిబ్బంది హాజరు తీరుపై

Published : 09 Apr 2020 08:50 IST

ఒంటిమిట్ట: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మంగళవారం రాత్రి సీతారాముల కల్యాణం సందర్భంగా జరిగిన ఏర్పాట్లు, తితిదే అధికారులు, సిబ్బంది హాజరు తీరుపై జిల్లాకు చెందిన దేవదాయశాఖ సీనియర్‌ అధికారి ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జానకీరాముల పరిణయ ఘట్టానికి పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక్కడ తితిదే యంత్రాంగం నిబంధనలు పాటించలేదని, హోదాలతో పని లేకుండా 40 మందికిపైగా ఆలయంలోకి అనుమతిచ్చారని ఫిర్యాదులు పేర్కొన్నట్లు తెలిసింది. ఓ పోలీస్‌ అధికారి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని సదరు సీనియర్‌ అధికారి నొచ్చుకున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని