వైద్యుడి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి: చంద్రబాబు

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ కె.సుధాకర్‌ సస్సెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి

Published : 09 Apr 2020 11:15 IST

హైదరాబాద్: విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్‌ కె.సుధాకర్‌ సస్సెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇలాంటి చర్యతో ఇతర వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో మనోధైర్యం దెబ్బతింటుందని లేఖలో పేర్కొన్నారు. రక్షణ పరికరాలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న ఆవేదననే సుధాకర్‌ వెల్లడించారని తెలిపారు.

 మాస్కులు, గ్లౌజులు అడిగిన వైద్యుడిని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడాలేదని చంద్రబాబు విమర్శించారు. అనంతపురం జిల్లాలో కూడా నలుగురు వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సుధాకర్‌ వ్యాఖ్యలను సానుకూలంగా చూడాలే తప్ప ప్రతికూల చర్యలు తగవన్నారు. ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న వారికి రక్షణ ఉపకరణాలు అందించడంపైనే ప్రభుత్వం దృష్టిపెట్టాలి తప్ప.. సస్పెన్షన్లు సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని