నేతలూ.. భౌతికదూరం పాటించండి: సీపీ

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న వేళ రాజకీయ నాయకులు భౌతిక దూరంపాటిస్తూ నిత్యావసరాలు పంపిణీ చేయాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు కోరారు. అనుమతి తీసుకొని మాత్రమే...

Updated : 09 Apr 2020 17:40 IST

విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న వేళ రాజకీయ నాయకులు భౌతిక దూరంపాటిస్తూ నిత్యావసరాలు పంపిణీ చేయాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు కోరారు. అనుమతి తీసుకొని మాత్రమే నిత్యావసరాలు పంచాలన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీల నేతలు, కార్యకర్తలు పలు చోట్ల భౌతికదూరం పాటించడంలేదు. ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది. పోలీసులకు మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లు ఇస్తున్నాం. విజయవాడ నగరంలో భవానీపురం, పాతరాజరాజేశ్వరీపేట, రాణిగారితోట, ఖద్దూస్‌నగర్‌‌, పాయకాపురం, సనత్‌నగర్‌లు రెడ్‌జోన్లుగా ఉన్నాయి. వీటిలోకి ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతిలేదు. ఈ రెడ్‌ జోన్లలో మున్సిపల్‌ సిబ్బంది ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తాం’’ అని సీపీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని