కరోనా పోరు: మనమంతా మారాలి

కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీని విజృంభణతో ప్రపంచమంతా వణికిపోతోంది. కొవిడ్‌-19పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.  కరోనాపై పోరులో ముఖ్యంగా.. 

Published : 09 Apr 2020 23:58 IST

గళమెత్తిన కళాకారులు 
పాటలతో విస్తృత ప్రచారం 


 

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ వైరస్‌ విజృంభణతో ప్రపంచమంతా వణికిపోతోంది. కొవిడ్‌-19పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.  కరోనాపై పోరులో ముఖ్యంగా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కరోనా బాధితుల సహాయార్థం సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. దీంతోపాటు కవులు, కళాకారులు తమ గళాన్ని వినిపిస్తూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా చిత్ర పరిశ్రమలో పని చేస్తోన్న సాంకేతిక విభాగానికి చెందిన యువత గళమెత్తింది. ఈ బృందం స్వరపరిచిన‘మనమంతా మారాలి’అనే గీతం అందరినీ ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా పోచారానికి చెందిన ప్రజానాట్యమండలి రచయిత, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి బండి సత్తన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి జానపద బాణీలతో ఆలపించిన పాట అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. 


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని