Published : 10/04/2020 11:30 IST

ఆ 4వేల మందిని ఆదుకోండి: చంద్రబాబు

హైదరాబాద్: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌ రాష్ట్రంలో చిక్కుకుపోయిన దాదాపు 4వేల మంది తెలుగువారిని ఆదుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాకు లేఖలు రాశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన జాలర్లు గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో చిక్కుకుపోయినట్లు వారి దృష్టికి తీసుకెళ్లారు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కాలం ముగిసేవరకు వారికి గుజరాత్‌ రాష్ట్రంలో వసతి కల్పించడంతోపాటు ఆహారం, వైద్య సదుపాయం అందించాలని లేఖ ద్వారా కోరారు. జాలర్ల యోగక్షేమాల పట్ల వారి కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని వారికి వివరించారు. ఈ మేరకు 4వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఫోన్‌ నెంబర్లను లేఖతో పాటు జత చేశారు.   

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని