Published : 11 Apr 2020 12:31 IST

కరోనా.. వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక క్యాబినెట్‌

హైదరాబాద్: కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులను వైరస్‌ బారి నుంచి కాపాడేందుకు రాసు టూల్స్‌ పరిశ్రమ ‘ఐసోలేటెడ్‌ టెస్టింగ్‌ క్యాబినెట్‌‘ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వైద్యులు కొవిడ్‌ బాధితులకు దూరంగా ఉండే నమూనాలు సేకరించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా రాసు టూల్స్‌ పరిశ్రమ యజమాని సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ... కొవిడ్‌ బాధితుల నమూనాలు సేకరించే క్రమంలో వైద్యులు, నర్సులు వైరస్‌ బారిన పడుతున్నారని అన్నారు. ఇందుకోసం రక్షణ రంగ అధికారుల సూచనల మేరకు ఈ ఐసోలేటెడ్‌ టెస్టింగ్‌ క్యాబినెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. 2.2 మీటర్ల ఎత్తు.. మీటరు వెడల్పు గల ఈ క్యాబినెట్‌ తయారీకి రూ.40వేలు ఖర్చైనట్లు ఆయన వెల్లడించారు. ఐసోలేటెడ్‌ టెస్టింగ్‌ క్యాబినెట్‌ ద్వారా కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించే వైద్యులు సురక్షితంగా నమూనాలు సేకరించవచ్చని సుధీర్‌రెడ్డి వివరించారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts