ఈ తేదీల్లో.. ఆకాశంలో భారీ మార్పులు
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఎన్నో వేల మందిని బలితీసుకుంది. అయితే మహమ్మారి రాకతో లాక్డౌన్ నేపథ్యంలో కాలుష్య తీవ్రత తగ్గుతోంది. కాలుష్య కోరల నుంచి భూమి తనని తాను..
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఎన్నో వేల మందిని బలితీసుకుంది. అయితే మహమ్మారి రాకతో లాక్డౌన్ నేపథ్యంలో కాలుష్య తీవ్రత తగ్గుతోంది. కాలుష్య కోరల నుంచి భూమి తనని తాను రక్షించుకుంటుందని ప్రకృతి ప్రేమికులు సంతోషిస్తున్నారు. అయితే ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రజలకు ఇటీవల ఆకాశంలో మార్పులు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 7వ తేదీన పింక్ సూపర్ మూన్‌ని ఆస్వాదించారు. తాజాగా మరో ఖగోళ సంఘటన జరగనుంది.
చంద్రుడితో గురుడు, శని, అంగారక గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ ఖగోళ సంఘటన ఏప్రిల్ 14, 15, 16వ తేదీల్లో జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాలుష్య తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో బైనాక్యులర్స్, టెలిస్కోప్ సాయం లేకుండానే ఆ రమణీయమైన దృశ్యాన్ని నేరుగా ఆస్వాదించవచ్చని చెప్పారు. గురుడు, శని, అంగారక గ్రహాలని మార్నింగ్ ప్లానెట్స్ అని అంటారు. అంటే అవి ఉదయాన స్పష్టంగా కన్పిస్తుంటాయి. ఏప్రిల్ మధ్యలో ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలో కన్పిస్తుంటాయి.
అయితే వాటితో పాటు ఈ సారి చంద్రుడు కూడా అదే వరుసలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 14, 15, 16వ తేదీల తర్వాత అంగారక గ్రహం వీటి నుంచి దూరంగా కదులుతుంది. అయితే ఈ మూడు రోజులు చంద్రుడిని గమనిస్తే.. సమీపంలోనే ఆ మూడు గ్రహాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోసారి ఈ మూడు మార్నింగ్ ప్లానెట్స్ కలిసి ఒకే వరుసలో రావడానికి మరో రెండేళ్లు పడుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..