వందశాతం లాక్‌డౌన్‌కి సహకరించాలి: సీపీ

రానున్న 15 రోజుల్లో వందశాతం లాక్‌డౌన్‌కి ప్రజలంతా పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును

Updated : 12 Apr 2020 17:13 IST

హైదరాబాద్‌: రానున్న 15 రోజుల్లో వందశాతం లాక్‌డౌన్‌కి ప్రజలంతా పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును ఆయన తనిఖీ చేశారు. అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. గతంలో వైద్యులపై జరిగిన దాడి దృష్ట్యా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పరిస్థితిని సమీక్షించామన్నారు. గాంధీ ఆస్పత్రిలో 200కి పైగా పోలీసులు విధుల్లో ఉన్నారని చెప్పారు. మెయిన్‌ గేటు, రిసెప్షన్‌, పేషంట్‌ ఎంట్రీ వద్ద రెండంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లతో పాటు మిగిలిన సిబ్బంది ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్నారని సీపీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని