తమిళనాడులో వెయ్యి దాటిన కరోనా కేసులు

తమిళనాడులో వెయ్యి దాటిన కరోనా కేసులు

Published : 12 Apr 2020 22:29 IST

చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి బీల రాజేశ్‌ వెల్లడించారు. పాజిటివ్‌గా తేలినవారిలో ఎనిమిది మంది వైద్యులు, ఐదుగురు నర్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 1,075కి చేరినట్లు చెప్పారు. 11 మంది కన్నుమూసినట్లు తెలిపారు. ‘రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచాం. మొత్తం 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. సరిపడా టెస్టింగ్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి’ అని రాజేశ్‌ తెలిపారు. ఆదివారం ఆరుగురితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని