దొరక్కుండా దోబూచులాడుతోంది

కరోనా వైరస్‌ను కనుక్కోవడంలో వైద్యనిపుణులు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొరక్కుండా దోబూచులాడుతోంది.. పరీక్షల్లోనూ కనిపించకుండా తప్పంచుకుంటోంది.. నెమ్మదిగా ప్రాణాలు తీసుకుంటుంది.. ఇదీ కరోనా విషక్రిమి స్వభావం. గుర్తించడం, పరీక్షించడం, వైద్యం అందించడం..

Published : 13 Apr 2020 00:29 IST

వైద్య నిపుణులకే అంతు చిక్కని వైనం 
వైరస్‌ నుంచి బయటపడినా మళ్లీ సోకనుందా.. ?
ఆందోళన రెకెత్తిస్తున్న అధ్యయనాలు 

అమరావతి: కరోనా వైరస్‌ను కనుక్కోవడంలో వైద్యనిపుణులు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొరక్కుండా దోబూచులాడుతోంది.. పరీక్షల్లోనూ కనిపించకుండా తప్పించుకుంటోంది.. నెమ్మదిగా ప్రాణాలు తీసుకుంటుంది.. ఇదీ కరోనా విషక్రిమి స్వభావం. గుర్తించడం, పరీక్షించడం, వైద్యం అందించడం.. ఈ త్రిసూత్ర విధానం ద్వారా కరోనా కట్టడి సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ వైరస్‌ను గుర్తించడమే కష్టంగా మారింది. ఒకసారి పాజిటివ్‌గా.. మరోసారి నెగిటివ్‌గా.. ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా రావడంతో.. వైద్య నిపుణులకూ ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొందరిలో కరోనా లక్షణాలున్నా పరీక్షల్లో నెగిటివ్‌ రావడం.. మరికొందరిలో అసలు లక్షణాలే లేకున్నా మహమ్మారి బయట పడడం.. ఇలా కరోనా తన వింత స్వభావంతో శాస్త్ర సాంకేతికతకే సవాల్‌ విసురుతోంది. 

ఫాల్స్‌ నెగిటీవ్‌.. 
వైద్య పరిభాషలో ‘ఫాల్స్‌ నెగిటివ్‌’ అంటే వ్యాధి ఉన్నా లేనట్లు రావడం. ఓ రకంగా చెప్పాలంటే వైరస్‌ శరీరంలో ఏదో మూలన ఉండీ దొరక్కుండా దాక్కోవడం. ఇప్పడు ఇదే ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించింది. వైరస్‌ను గుర్తించడమే అత్యంత కీలకమని వైద్యనిపుణులు ముక్తకంఠంతో చెబుతున్న తరుణంలో కరోనా స్వభావం అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికే ఆ మహమ్మారి నుంచి బయట పడిన వారు మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకునే ప్రమాదముందన్న దానిపై జరుగుతున్న అధ్యయనాలు ఆందోళన రెకెత్తిస్తున్నాయి. దీనికి తోడు ఫాల్స్ నెగిటివ్‌పై జరుగుతున్న పరిశోధనలు వెలుగులోకి వస్తుండడం పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని