వీడియో పెట్టి విమర్శలకు గురైన జపాన్ ప్రధాని
కరోనా కష్టకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇంట్లోనే టైమ్ పాస్ చేస్తున్నారు.
టోక్యో: కరోనా కష్టకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇంట్లోనే టైమ్ పాస్ చేస్తున్నారు. దీనికి దేశాధ్యక్షులు, ప్రధానులు మినహాయింపేమీ కాదు. ఎందుకంటే మందుల్లేని కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి భౌతిక దూరమే అసలైన మందు. అయితే ప్రస్తుతం అలాగే సేద తీరుతున్న జపాన్ ప్రధాని షింజో అబె ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. అది నెట్టింట్లో విమర్శలకు కారణమైంది. వివరాల్లోకి వెళ్తే..
ఆ వీడియోలో అబె సోఫా మీద కూర్చొని పెంపుడు కుక్కతో సమయాన్ని గడపుతూ, టీ తాగుతూ, పుస్తకాన్ని చదువుతూ కనిపించారు. అలాగే ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలంటూ సూచించారు. అయితే ఆయన విలాసవంతమైన జీవితాన్ని ఉద్దేశిస్తూ నెటిజన్లు విమర్శలు చేశారు. ‘ఈ క్లిష్ట సమయంలో ప్రజలందరూ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. ఆ వీడియో మీ లగ్జరీని చూపిస్తుంది’ అని కామెంట్లు చేశారు. అలాగే ‘మీరెవరనుకుంటున్నారు?’ అనేది ట్విటర్ ట్రెండింగ్లో టాప్లో నిలిచింది. ఈ సందేశం కరోనా విజృంభణ సమయంలో పేదరికంలో మనుగడను సాగిస్తున్నవారి కష్టాలను విస్మరించిందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలంటూ ప్రముఖ సంగీతకారుడు జెన్ హొషినో వీడియోకు స్పందనగా అబె ఆ వీడియోను పోస్టు చేశారు. ఇదిలా ఉండగా, జపాన్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య ఏడు వేలను దాటింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..