వద్దురా అన్న.. బయటకు రాకురోయన్న..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురాడానికి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తమకు తోచిన విధంగా ఎన్నో మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు...

Updated : 13 Sep 2023 12:43 IST

వద్దన్నా నువ్వు వస్తే.. కాటేస్తుంది కరోనా..

అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురాడానికి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. తమకు తోచిన విధంగా ఎన్నో మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారిణి స్వయంగా పాట పాడి.. సామాజిక దూరం ఆవశ్యకతను వివరించారు.  మహిళా రక్షణ విభాగంలో అడిషనల్‌ ఎస్పీ, సీఐడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేజీవీ సరిత తన పాట ద్వారా ప్రజలను ఆలోచింపజేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో పోలీసులు ముందున్నారని, యువత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని.. ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ వేళ ప్రజలంతా తమ కుటుంబసభ్యులతో గడుపుతుంటే.. తాము మాత్రం కంటికి నిద్ర లేకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నామంటూ ఎంతో చక్కగా ఆలపించారు. ఈ పాటను మీరు కూడా ఓ సారి వినండి..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని