ఏప్రిల్‌ 17 నాటికి గ్రీన్‌జోన్‌గా గోవా: సీఎం ప్రమోద్‌

గత 11రోజులుగా గోవారాష్ట్రంలో కొత్త కరోనా కేసులేవి నమోదు కానందున ఏప్రిల్‌ 11 నాటికి గోవా గ్రీన్‌జోన్‌గా మారనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌సావంత్‌

Published : 14 Apr 2020 21:21 IST

పనాజీ: గత 11 రోజులుగా గోవాలో కొత్త కరోనా కేసులేవీ నమోదు కాలేదని ఏప్రిల్‌ 11 నాటికి గోవా గ్రీన్‌జోన్‌గా మారనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మంగళవారం అన్నారు. రాష్ట్రంలో రెండు జిల్లాల మినహా దక్షిణగోవాను గ్రీన్‌జోన్‌గా ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకూ గోవాలో 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారంతా కూడా నార్త్‌గోవాకు చెందిన వ్యక్తులే. వీరిలో 5గురు కోలుకోగా, మిగిలిన ఇద్దరికి చికిత్స జరుగుతోంది. రాష్ట్ర సరిహద్దులను ఎప్పటికప్పుడు పర్వవేక్షిస్తునట్టు సీఎం తెలిపారు.

ముఖ్యంగా మహరాష్ట్రలోని సింధుదుర్గ్‌, కర్ణాటకలోని బెళగావి ప్రాంతాలను ఆరెంజ్‌జోన్‌లుగా ప్రకటించిన నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా పర్వవేక్షిస్తునట్టు సృష్టం చేశారు. వైద్యం ఇతర నిత్యావసర వస్తువులతో రాష్ట్రంలోకి వచ్చే వాహనాలన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శానిటైజింగ్ మార్గాల గుండా రావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకు ముందు ప్రకటించిన ఏప్రిల్‌ 14న కాకుండా 20వ తేది నుంచి విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాల ప్రకారం మే 3 వరకు గోవా ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్రమబద్ధీకరించేదుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటునట్టు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు