పర్యాటక ప్రాంతాలపై ‘దేఖో అప్నా దేశ్‌’

లాక్‌డౌన్‌ ప్రభావం దేశ పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. రాకపోకలు నిలిచిపోవడంతో ఆయా సందర్శనీయ స్థలాలు నిర్మానుష్యంగా మారాయి. ఈ తరుణంలో పర్యాటకులకు కాస్త ఊరటగా

Published : 15 Apr 2020 01:02 IST

వెబినార్‌ సిరీస్‌ను ప్రారంభించిన పర్యాటక శాఖ

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ ప్రభావం దేశ పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. రాకపోకలు నిలిచిపోవడంతో ఆయా సందర్శనీయ స్థలాలు నిర్మానుష్యంగా మారాయి. ఈ తరుణంలో పర్యాటకులకు కాస్త ఊరటగా పర్యాటకశాఖ మంగళవారం ‘దేఖో అప్నా దేశ్‌’ పేరిట వెబినార్‌ సిరీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సంపద విశిష్టతను వర్చువల్‌ రూపంలో తెరపై వీక్షించే అవకాశం కలుగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం దిల్లీ నగరంపై ‘సిటీ ఆఫ్‌ సిటీస్‌- దిల్లీస్‌ పర్సనర్‌ డైరీ’ పేరిట రూపొందించిన తొలి వెబినార్‌ను ప్రసారం చేసింది. పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఈ వెబినార్‌ సిరీస్‌పై మాట్లాడుతూ.. మన నాగరికత విశేషాలు, స్మారక కట్టడాలు, కళలు, నృత్యాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, పండగలను ఈ సాంకేతికత సాయంతో ప్రజలకు చేరువ చేయనున్నట్లు తెలిపారు. పర్యాటకశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వెబినార్‌ సిరీస్‌ను వీక్షించే అవకాశం కల్పించనట్లు వివరించారు. తర్వాతి వెబినార్‌ ఏప్రిల్‌ 16న కోల్‌కతా నగర విశేషాలపై ఉంటుందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని