మీరంతా ‘సెల్ఫీ’లు దిగి పంపండి:దిల్లీ ప్రభుత్వం
కరోనా వైరస్ అనుమానితులందరిని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు హోమ్క్వారంటైన్లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తుంది. అయినప్పటికి కొందరు వ్యక్తులు
దిల్లీ: కరోనా వైరస్ అనుమానితులందరిని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు హోమ్క్వారంటైన్లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికి కొందరు వ్యక్తులు అధికారులు కళ్లుగప్పి నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్నారు. ఇలాంటివారిని కట్టడి చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన యాప్ తీసుకురానుంది. హోమ్క్వారంటైన్లో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ ఇంటిలో ఉండి సెల్ఫీ తీసి ఈ యాప్లో కంట్రోల్రూమ్కి పంపాలి. వెంటనే అధికారులు యాప్లో ఉన్న సాంకేతికతతో ట్రాకింగ్ చేసి వారు ఇంటిలో ఉన్నారా, లేక బయట ఉన్నారా అనే విషయాన్ని నిర్థారిస్తారు. ఇప్పటికే అన్ని జిల్లాల పాలనాధికారులకు ఇందుకు సంబంధించి మార్గనిర్దేశకాలు వెళ్లినట్టు ప్రభుత్వ ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లగా ప్రకటించిన ప్రాంతాల్లో దీనిని మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యాప్ పనితీరుకు సంబంధించి సమీక్షలు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోమ్క్వారంటైన్ నిబంధనల అతిక్రమణ కింద ఏప్రిల్ 6 నాటికి 250వరకు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దేశ రాజధానిలో ఇప్పటివరకు మొత్తం 1578 కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 32మంది మృత్యువాతపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు