కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించలేదు

బీజింగ్‌: కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే స్పష్టం చేసినట్లు చైనా విదేశాంగశాఖ పేర్కొంది.

Updated : 16 Apr 2020 17:58 IST

డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఇదే తెలిపింది: చైనా

బీజింగ్‌: కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే స్పష్టం చేసినట్లు చైనా విదేశాంగశాఖ పేర్కొంది. ఈ మహమ్మారి తొలుతగా ఆ దేశంలోని వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అక్కడే ఓ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారనే ఆరోపణలను సదరు శాఖ అధికార ప్రతినిధి ఒకరు గురువారం ఈ మేరకు ఖండించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఈ విషయమై మాట్లాడుతూ తమ ప్రభుత్వం.. కరోనా వైరస్‌ ల్యాబ్‌ నుంచి వ్యాప్తి చెందిందా అనే విషయాన్ని తేల్చే పనిలో ఉందన్నారు. ఈ వ్యవహారంలో చైనా నిజానిజాలు వెల్లడించాలని స్టేట్‌ సెక్రెటరీ మైక్‌ పాంపియో డిమాండ్‌ చేశారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచార వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు చైనాపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని