Updated : 18/04/2020 16:06 IST

టోల్‌ మినహాయింపు గడువు పొడిగించాలి

ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఈనెల 20 నుంచి టోల్‌ ఫీజులు అమల్లోకి వస్తాయని జారీ చేసిన ఉత్తర్వులను లాక్‌డౌన్‌ ముగిసే వరకు నిలుపుదల చేయాలని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నేషనల్‌ హైవే ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది.

లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం టోల్‌ మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరింది. ప్రస్తుతం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన లారీలు రాష్ట్రానికి తిరిగి రాక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు రవాణా రంగానికి ఆమోద యోగ్యంగా లేవని పేర్కొంది. కష్టకాలంలో రవాణా రంగానికి ఊరటనిచ్చే టోల్‌ మినహాయింపును పొడిగించాలని ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని