అప్పుడు వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రామాణికం అవ్వొచ్చు

చైనాలో ఆవిర్భవించిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను సర్వ నాశనం చేస్తుంది. పేదా, ధనిక అనే తేడాల్లేకుండా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ఈ వైరస్‌ ధాటికి ఇప్పటికే లక్షల మంది ...

Updated : 18 Apr 2020 15:33 IST

కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో ఆవిర్భవించిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను సర్వ నాశనం చేస్తుంది. పేదా, ధనిక అనే తేడాల్లేకుండా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ఈ వైరస్‌ ధాటికి ఇప్పటికే లక్షల మంది బాధితులుగా మారారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులు ‘ఇంటి నుంచే పని’ చేయాలని ఆయా సంస్థలు ఆదేశిస్తున్నాయి. 

‘అత్యవసర విభాగాల్లో పని చేసేవారు తప్ప మిగతా ఉద్యోగులంతా ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ చేస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తాజాగా స్పందించారు. కరోనా వైరస్‌ వెళ్లిపోయాక ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ అనేది కొత్త ప్రమాణికంగా మారుతుందని చెప్పారు. ‘కరోనా వెళ్లిపోయాక ఈ ప్రపంచం మరోలా రూపాంతరం చెందుతుంది. ‘‘ఇంటి నుంచి పని’’చేసే కొత్త ప్రామాణికం పుట్టుకొస్తుంది. అయితే, భారత దేశ ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ పద్ధతి తెలిసేలా.. నా శాఖలోని సిబ్బందిని బలమైన యంత్రాంగంతో పనిచేయాలని చెప్పా. అది ఆర్థికంగా, లాభసాటిగా ఉంటుందని తెలిపా’ అని రవిశంకర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని