అంత వయస్సులోనూ ఉత్సాహంగా..

ఆ బామ్మ వయస్సు 98 ఏళ్లు. కర్ర ఊతంగా చేసుకుని నడుస్తుంది. ఒక కన్ను మసకగా కనిపిస్తుంది. అయితేనేం.. ఆమె సంకల్ప శక్తి గొప్పది. ప్రస్తుతం ఆమె కరోనా కట్టడిలో తనవంతు పాత్ర పోషిస్తోంది. అంత వయస్సులోనూ ఉదయాన్నే లేచి.. ప్రార్థనలు పూర్త చేసుకుని.. ఆ తర్వాత కుట్టు యంత్రంపై ఉత్సాహంగా మాస్కులు కుడుతోంది.

Published : 19 Apr 2020 00:43 IST

మాస్కులు కుడుతున్న 98 ఏళ్ల పంజాబ్‌ బామ్మ

చండీగఢ్‌: ఆ బామ్మ వయస్సు 98 ఏళ్లు. కర్ర ఊతంగా చేసుకుని నడుస్తుంది. ఒక కన్ను మసకగా కనిపిస్తుంది. అయితేనేం.. ఆమె సంకల్ప శక్తి గొప్పది. ప్రస్తుతం కరోనా కట్టడిలో తనవంతు పాత్ర పోషిస్తోంది. అంత వయస్సులోనూ ఉదయాన్నే లేచి.. ప్రార్థనలు పూర్తి చేసుకుని.. ఆ తర్వాత ఉత్సాహంగా మాస్కులు కుట్టడంలో నిమగ్నమవుతోంది. కుటుంబీకుల సహకారంతో సమీప వాసులకు ఉచితంగా అందజేస్తోంది. ఆమె.. పంజాబ్‌ రాష్ట్రం మోగా జిల్లాకు చెందిన గురుదేవ్‌ కౌర్‌ ధాలివాల్‌. ఆమె వినియోగిస్తున్న కుట్టుమిషన్ సైతం వందేళ్ల క్రితం నాటిది కావడం విశేషం.
ఉచితంగా పంపిణీ చేస్తూ..
వృద్ధురాలి కోడలు అమర్‌జిత్‌ కౌర్‌ వివరాలు వెల్లడిస్తూ.. ‘అధిక ధరల కారణంగా కొనుగోలు చేసే శక్తి లేక మా ప్రాంతంలో కూరగాయలు విక్రయించేవారు మాస్కులు ధరించేవారు కాదు. దీంతో మేం వారికి ఉచితంగా అందజేసేందుకు ముందుకువచ్చాం. ఈ క్రమంలో ఇరుగు పొరుగువారూ మాకు తోడ్పాటునందిస్తున్నారు. కొందరు వస్త్రం సమకూర్చుతున్నారు. మాస్కుల కోసం పలువురు రోజూ మా ఇంటికి వస్తున్నారు’ అని తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పంజాబ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని