3.12 లక్షల వలస కార్మికులను గుర్తించాం

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన 3.12 లక్షల మంది వలస కార్మికులను గుర్తించినట్లు తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ..

Updated : 18 Apr 2020 19:17 IST

తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన 3.12 లక్షల మంది వలస కార్మికులను గుర్తించినట్లు తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. వలస కార్మికులందరికీ రెండో విడతగా బియ్యంతో పాటు రూ.500 పంపిణీ చేస్తున్నామన్నారు. 

రేషన్ కార్డు దారులకు ఇస్తున్న రూ.1500 పరిహారం ఇప్పటి వరకు బ్యాంకుల్లో పడని వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. 5.21 లక్షల మందికి పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ అయిన రూ.1500 బ్యాంకు నుండి మళ్లీ వెనక్కి వెళ్లిపోతాయన్న అపోహలు అవసరం లేదని చెప్పారు. కందిపప్పు గురించి కేంద్రానికి లేఖ రాశామని, రాగానే అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు లేనివాళ్ల గురించి రేపు క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని