మా బాబు పేరు.. ’లాక్‌డౌన్‌’ 

కరోనా ఉద్ధృతికి ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకు  కొత్తకేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా...

Published : 20 Apr 2020 00:30 IST

అగర్తల(త్రిపుర) : కరోనాతో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకు  కొత్తకేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా  లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయితే ఈ సమయంలో  తమకు పుట్టే పిల్లలకు  విభిన్నంగా పేర్లు పెట్టుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు.వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌బౌరి, మంజు బౌరి భార్యాభర్తలు.  సంవత్సరంలో ఆరునెలలు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ప్లాస్టిక్‌ వస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఈ సారి సరికొత్త అనుభవం ఎదురైందట. 
మార్చి 24న ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.  ప్లాస్టిక్‌ వస్తువులను విక్రయించేందుకు దంపతులిద్దరూ త్రిపుర రాష్ట్రానికి వెళ్లారు. మంజు గర్భిణి కావడంతో  బస్సు, రైలులో  రాజస్థాన్‌కు ప్రయాణం చేయడం ప్రమాదమని సంజయ్‌బౌరి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజే కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో రాజస్థాన్‌కు వెళ్లాలని  బాధర్‌ఘాట్‌ వద్ద గల అగర్తల రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.   రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో  అక్కడే చిక్కుకున్నామని సంజయ్‌ వాపోయారు. 
ప్రస్తుతం బాబు పుట్టి ఆరురోజులవుతోంది. ఈ సమయంలో  పుట్టడంతో తమ కుమారుడికి లాక్‌డౌన్‌ అని పేరుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు  ఆయన చెప్పారు.   ఆశ్రయం కల్పించి తన భార్యను ఆసుపత్రికి తరలించడంలో సహాయం చేసిన రైల్వే పోలీసులు, త్రిపుర రాష్ట్రప్రభుత్వానికి  కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత రాజస్థాన్‌కు వెళ్లనున్నట్లు సంజయ్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని